భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విమానాశ్రయం నిర్మించే ప్రయత్నాలు సాంకేతిక అడ్డంకుల వల్ల మళ్లీ మొదటికి వచ్చాయి. గతంలో సుజాతనగర్ మండలం గరీబ్‌పేట ప్రాంతాన్ని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) పరిశీలించి.. ప్రతికూల నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం దుమ్ముగూడెం మండలంలో విమానాశ్రయ నిర్మాణానికి అనువైన స్థలం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటైతే భద్రాచలం భక్తులకు, మూడు రాష్ట్రాల సరిహద్దుల్లోని వాణిజ్యానికి గేట్‌వేగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.