తెలంగాణ ట్రైన్ ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్‌కు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం పటాన్‌చెరు-ఆర్మూర్-ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ పనులను ప్రారంభించడానికి కేంద్ర రైల్వే శాఖ సిద్ధమైంది. 250 కి.మీ.ల ఈ మార్గం.. ఆదిలాబాద్ నుంచి నగరానికి 72 కి.మీ. దూరాన్ని తగ్గిస్తుంది, సమయం, ఖర్చూ ఆదా చేస్తుంది. ఇది నిర్మల్, నిజామాబాద్, బోధన్, సంగారెడ్డిలను కలుపుతూ పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుంది.