తెలంగాణలో మరో జేఎన్టీయూ కళాశాల.. ఏదులాపురంలోని కళాశాలకు శంకుస్థాపన చేసిన సీఎం..

1 month ago 8
ఖమ్మం జిల్లా ఏదులాపురంలో జేఎన్‌టీయూ (JNTU) ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు 362 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా నూతన నర్సింగ్ కళాశాలను ప్రారంభించిన సీఎం, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. జపాన్, జర్మనీ వంటి దేశాల్లో నర్సులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మన విద్యార్థులకు ఆయా భాషల్లో శిక్షణ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి, మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ పనులకు శ్రీకారం చుట్టారు.
Read Entire Article