తెలంగాణలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు నల్గొండలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో నలుగురు గాయపడ్డారు.