తెలంగాణలో మరో స్మార్ట్ హైవే.. ఈ మార్గంలోనే, వేగంగా సాగుతున్న పనులు

1 week ago 4
ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) రహదారులను స్మార్ట్ హైవేలుగా మారుస్తోంది. తాజాగా అదిలాబాద్, నిర్మల్ జిల్లాల మీదుగా సాగే 200 కి.మీ. పొడవునా ఎన్‌హెచ్ 44ను అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, సోలార్ సెన్సార్ల సాయంతో ఈ హైవేపై నిరంతర నిఘా కొనసాగనుంది. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ సమాచారం అందించడం, నేరాలను అరికట్టడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశంగా ఎన్‌హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు.
Read Entire Article