తెలంగాణలో మరోసారి భూకంపం వచ్చింది. డిసెంబర్ 04వ తేదీన ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించగా.. సరిగ్గా మూడు రోజుల తర్వాత మరోసారి భూప్రకంపనలు రావటంతో.. జనాలు బెదిరిపోయారు. ఈసారి మహబూబ్‌నగర్ జిల్లాలోని దాసరిపల్లి కేంద్రంగా నమోదైన భూకంపం.. రిక్టారు స్కేలుపై 3.0గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. భూమి లోపల సుమారు 10 కిలోమీటర్ల లోతన ఈ భూకంపం వచ్చినట్టు అధికారులు తెలిపారు.