తెలంగాణలో మూడు కొత్త ఎయిర్‌పోర్టులు.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

2 months ago 11
తెలంగాణలో ఏవియేషన్ రంగాన్ని విస్తరిస్తూ రాష్ట్రంలో మూడు కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నట్లు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ఏరోమార్ట్ 2026 సదస్సులో మాట్లాడిన ఆయన.. వచ్చే నెలలో వరంగల్ ఎయిర్‌ఫీల్డ్‌కు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఆదిలాబాద్‌ను పౌర, మిలిటరీ ఇలా రెండు రకాల అవసరాల కోసం అలాగే కొత్తగూడెంలో మరో ఎయిర్‌ఫీల్డ్‌ను కేంద్రం అనుమతితో నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రస్తుతం 1500 ఎంఎస్ఎంఈలతో అంతర్జాతీయ ఏరోస్పేస్, రక్షణ రంగ సంస్థలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మంత్రి స్పష్టం చేశారు.
Read Entire Article