వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో తెలంగాణ సర్కార్‌కు పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ అయిన యునిలివర్.. తెలంగాణలోని కామారెడ్డిలో పామాయిల్ తయారీ యునిట్‌తో పాటు బాటిల్ మూతల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోగా.. తాజాగా ప్రైవేట్ రాకెట్ల తయారీ యూనిట్ పెట్టేందుకు స్కైరూట్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు.. రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎంఓయూ చేసుకుంది.