తెలంగాణలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు వేగంగా సాగుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లోనే 4.54 కోట్ల పనిదినాలు పూర్తయ్యాయి. కేంద్రం నిర్దేశించిన 6.50 కోట్ల పనిదినాల లక్ష్యం జూన్ నెలాఖరుకు పూర్తి కానుంది. పనిదినాలు పూర్తి కాగానే తదుపరి పనులకు కేంద్రం అనుమతి లేనందున రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఢిల్లీకి వెళ్లి పని దినాలు పెంచాలని కేంద్రాన్ని అభ్యర్థించనున్నారు.