తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి భూముల మార్కెట్ విలువలు పెరగనున్నాయి. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలో ఈ అంశం గురించి విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆయన.. భూముల మార్కెట్ విలువ పెంపు ద్వారా ప్రభుత్వానికి 1400 కోట్ల వరకూ ఆదాయం వస్తుందన్నారు. భూసేకరణ సమయంలో ప్రభుత్వానికి నష్టం కలిగినా.. రైతులకు మాత్రం లాభమేనని అభిప్రాయపడ్డారు.