ప్రపంచంలోనే అతిపెద్ద కళ్లద్దాల సంస్థల్లో ఒకటైన లెన్స్‌కార్ట్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్ శివారు తుక్కుగూడలో రూ.1500 కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిశ్రమ ద్వారా 1600 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇక్కడ ఉత్పత్తి చేసే ఉత్పత్తులను దేశ విదేశాలకు ఎగుమతి చేయనున్నారు.