జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తా చాటాలనే ఉద్దేశంతో.. సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ రూ.లక్ష ఆర్థిక సహాయం అందించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులై.. ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి కూడా మరో రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక మెయిన్స్‌కు తెలంగాణ నుంచి 202 మంది అర్హత సాధించగా.. 40 మంది పాస్ అయి ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. త్వరలోనే వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.