హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో.. గ్రామీణ ప్రజలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించేందుకు కృషి చేయాలని డీపీఓలకు సీతక్క సూచించారు. ఈ క్రమంలోనే.. సీతక్క శుభవార్త వినిపించారు. గ్రామాల్లోని సఫాయి కార్మికులతో పాటు మల్టీపర్పస్ వర్కర్లకు ప్రతి నెలా.. ఐదో తారీఖులోపే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి వివరించారు.