సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి.. ముందు నుంచి చెప్తున్నట్టుగా.. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా విద్యాకమిషన్ ఏర్పాటుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా.. విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఇందులో ఓ ఛైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యులు ఉండనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొనగా.. వారిని త్వరలోనే నియమించనున్నట్టు తెలిపింది.