Smart Market Yards In Telangana: తెలంగాణలో ఇక స్మార్ట్ మార్కెట్‌యార్డులు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ, ఏఐ సాంకేతికతల వినియోగించనున్నారు. ఇకపై మార్కెట్ యార్డుల్లో క్రయవిక్రయాలు, లావాదేవీలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.. ఈ మేరకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి అన్ని ఏర్పాట్లు చేస్తోంది మార్కెటింగ్‌శాఖ. ముందుగా గడ్డి అన్నారం మార్కెట్‌లో ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డుల్లో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.