తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి బృందం.. అమెరికా టూర్‌ను దిగ్విజయంగా ముగించుకుని.. ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలోనే.. ప్రముఖ కంపెనీలతో భేటీ కాగా.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ప్రపంచంలో ప్రఖ్యాత హ్యుందాయ్ మోటర్స్ సంస్థ.. తెలంగాణలో సరికొత్త మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.