తెలంగాణలోని విద్యార్థులకు అలర్ట్.. నేడు స్కూళ్లు, కాలేజీలు బంద్

1 year ago 26
తెలంగాణలో నేడు (జులై 23) స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి. విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐవైఎఫ్ వంటి విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల నియంత్రణకు చట్టం, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, పెండింగ్ స్కాలర్‌షిప్‌ల విడుదల, ఉచిత బస్ పాసులు, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం వంటివి వారి ప్రధాన డిమాండ్లు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే సెలవులు ప్రకటించాయి.
Read Entire Article