తెలంగాణలో అతిపెద్ద, ఆధునిక గోశాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా ఎన్కేపల్లిలో వంద ఎకరాల ప్రభుత్వ భూమిలో రూ. 157 కోట్లతో ఈ ప్రాజెక్టును హెచ్‌ఎండీఏ చేపట్టింది. నిరాశ్రయంగా నగరంలో తిరుగుతున్న గోవులను అక్కడకు తరలించనున్నారు.