తెలంగాణ ప్రజలకు బిగ్ అప్డేట్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల గణన సర్వేను నిర్వహిస్తుండగా.. ఆ రిపోర్టు వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లను ఖరారు చేసి పంచాయతీల బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి.. డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదల కానుందని.. జనవరిలో సర్పంచ్ ఎన్నికలు జరుగనున్నాయన్న వార్త వైరల్ అవుతుంది.