ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మంగళవారం టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగానే నామినేటెడ్ పదవుల భర్తీపై క్లారిటీ ఇచ్చారు. జూన్‌లోగా అన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామన్న చంద్రబాబు.. పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పోస్టుల భర్తీ కోసం క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ లెవల్ సభ్యులను సిఫార్సు చేయాలని నేతలకు సూచించారు. దీంతో కూటమి నేతల్లో ఆశలు మొదలయ్యాయి.