ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై సోమవరం వద్ద టోల్ వసూళ్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి. భారత్ మాల పరియోజన కింద నిర్మితమైన ఈ రహదారి వల్ల హైదరాబాద్-విశాఖ మధ్య 80 కి.మీ దూరం తగ్గనుంది. ప్రస్తుతం 116 కి.మీ మార్గం అందుబాటులోకి రాగా.. ఏఐ నిఘా, సోలార్ వెలుగులు, 1033 హెల్ప్‌లైన్ వంటి అధునాతన సౌకర్యాలు కల్పించారు. ఈ ప్రాజెక్టు ఖమ్మం జిల్లా వాణిజ్య, ఆర్థిక అభివృద్ధికి కీలకంగా మారనుందని అధికారులు చెబుతున్నారు.