తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వారికి గుడ్‌న్యూస్. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాహనదారులు ఎగిరిగంతేసే వార్త. ఎందుకంటే త్వరలోనే మరో కొత్త హైవే అందుబాటులోకి రానుంది. ఖమ్మం-దేవరపల్లి మధ్య హైటెక్ హంగులతో నిర్మించిన హైవేను మే నెలలో ప్రారంభించేందుకు ఎన్‌హెచ్ఏఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ హైవే అందుబాటులోకి వస్తే హైదరాబాద్-విశాక 56 కి.మీ దూరం తగ్గనుంది.