తెలుగు రాష్ట్రాల్లో అనేక ట్రావెల్స్ బస్సులు NL, DD, PY, AR నంబర్ ప్లేట్లతో తిరుగుతుండటం చాలా మంది చూసే ఉంటారు. ఆ రాష్ట్రాల బస్సులు ఇక్కడెందుకు ఉన్నాయనే డౌట్ వస్తుంది. పన్నులు ఎగ్గొట్టడానికి, కఠిన నిబంధనల నుంచి తప్పించుకోవడానికి చాలా ట్రావెల్స్ కంపెనీలు.. బస్సులను ఆయా రాష్ట్రాల్లో రిజిస్టర్ చేయిస్తున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తక్కువ పన్నులు, రాయితీలు ఉండటంతో అక్కడే రిజిస్ట్రేషన్ చేయించి.. మన దగ్గర తిప్పుతున్నారు. దీనివల్ల రాష్ట్రాల పన్ను ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా, ఫిట్‌నెస్ లేని బస్సులతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి.