Vizianagaram District Forest Department Alert On Elephants: విజయనగరం జిల్లాలో కొద్దిరోజులగా అడవి ఏనుగులు సంచరిస్తున్నాయి. గజరాజుల దెబ్బకు జనాలు భయపడుతున్నారు.. పంటల్ని నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి ఈ అడవి ఏనుగుల్ని కుంకీల సాయంతో తరిమేసి, ఆ తర్వాత మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తెల్లని దుస్తులు ధరించి అడవి ఏనుగుల దగ్గరకు వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.