తెల్లవారుజామునే పెళ్లి.. తలపై జీలకర్ర బెల్లంతోనే పరీక్షా కేంద్రానికి నవ వధువు

1 month ago 5
ఈరోజు తెల్లవారుజామునే పెళ్లి జరిగింది. ఆ వెంటనే గ్రూప్-2 పరీక్ష ఉండటంతో పెళ్లి దుస్తులతోనే పరీక్ష కేంద్రానికి వచ్చింది నవ వధువు. తలపై జీలకర్ర బెల్లం తీయకుండానే పరీక్షలకు హాజరైంది. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతికి చెందిన నమిత.. గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయింది. మెయిన్స్ రాయాల్సి ఉంది. ఇవాళ తెల్లవారుజామునే ఆమె వివాహం జరిగింది. ఉదయాన్నే పరీక్ష ఉండడంతో.. తలపై జీలకర్ర బెల్లం, పెళ్లి దుస్తులతో అలాగే ఎగ్జామ్స్ సెంటర్‌కు వచ్చి పరీక్షకు హాజరైంది.
Read Entire Article