తేజేశ్వర్, ఐశ్వర్య ఆడియో కాల్ లీక్.. సంచలన విషయాలు

8 months ago 11
తెలంగాణలో కలకలంరేపిన తేజేశ్వర్ హత్యకేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటపడ్డాయి. పెళ్లికి ముందు తేజేశ్వర్, ఐశ్వర్యలు మాట్లాడుకున్న ఫోన్ కాల్ ఆడియో వైరల్ అవుతోంది. కట్నంతో పాటుగా పెళ్లికి సంబంధించిన అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. తేజేశ్వర్‌ను చంపి మృతదేహాన్ని మాయం చేసేందుకు ఐశ్వర్య, తిరుమలరావు ప్లాన్ చేశారు.. తేజేశ్వర్ మృతదేహాన్ని కర్నూలు శివార్లలోని ఓ రియల్‌ఎస్టేట్ వెంచర్‌లో పూడ్చాలని స్కెచ్ వేశారు. తేజేశ్వర్‌ హత్యకు నగేష్, పరశురామ్, రాజు అనే ముగ్గురికి.. తిరుమలరావు సుపారీ ఇచ్చాడు. పని పూర్తయ్యాక లద్దాఖ్ పారిపోవాలని తిరుమలరావు, ఐశ్వర్య ప్లాన్ చేసుకున్నారు. అక్కడే సహజీవనం చేయాలనుకున్నారు. లద్దాఖ్‌లో సెటిలవ్వడానికి బ్యాంక్‌ నుంచి తిరుమలరావు 20 లక్షలు లోన్ కూడా తీసుకున్నాడు. తేజేశ్వర్‌ని చంపేశాక మృతదేహాన్ని కారులో కర్నూలు తీసుకెళ్లి.. తిరుమలరావుకు చూపించింది సుపారీ గ్యాంగ్. తేజేశ్వర్‌ డెడ్‌బాడీ చూశాకే ఆ గ్యాంగ్‌కు తిరుమలరావు డబ్బు ఇచ్చాడు.
Read Entire Article