తిరుమలలో వెంగమాంబ అన్నదాన కేంద్రంలో తొక్కిసలాటలో బాలుడి మరణం అంటూ వస్తున్న వార్తలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కర్ణాటకకు చెందిన మంజునాథ బాలుడు ఆరేళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడన్న టీటీడీ.. ఫిబ్రవరి 22వ తేదీ సాయంత్రం అన్నదాన కేంద్రంలో భోజనం చేసిన బాలుడు బయటకు వస్తూ అపస్మారక స్థితిలో వెళ్లినట్లు తెలిపింది. వెంటనే బాలుడిని అశ్వినీ ఆస్పత్రికి తరలించామని పేర్కొంది. అక్కడి డాక్టర్ల సూచన మేరకు అనంతరం తిరుపతి స్విమ్స్‌కు తరలించినట్లు తెలిపింది. స్విమ్స్‌లో చికిత్స పొందుతూ ఆ బాలుడు మంగళవారం చనిపోయినట్లు టీటీడీ పేర్కొంది. టీటీడీపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.