అమరవీరుల కుటుంబాలకు నూతనంగా రాజ్యసభ ఎంపీగా ఎంపికైన చింతకాయల విజయ్ అండగా ఉన్నారు. తనకు ఎంపీగా వచ్చిన మొదటి నెల జీతాన్ని అమరవీరుల కుటుంబాలకు అందజేశారు. ఆయనకు వచ్చిన రూ. 3 లక్షల చెక్కును రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్‌కు అందజేశారు. దేశం కోసం పాటుపడుతున్న సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. పదవి చేపట్టిన తర్వాత తనకు వచ్చిన మొదటి జీతాన్ని ఇలా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని విజయ్ అన్నారు.