మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కుమారుడిని తాత పట్టించుకోవడం లేదన్న కోపంతో.. తోడికోడలి నాలుగేళ్ల కుమారుడిని చంపేందుకు పిన్ని కుట్ర చేసింది. ఎవరూ లేని సమయం చూసి జ్యూస్ అని చెప్పి చిన్నారికి యాసిడ్ తాగించింది. తీవ్ర అస్వస్థతతో బాలుడు ఆసుపత్రి పాలవగా.. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.