త్వరలో మాజీ మంత్రి, ఆయన కొడుకు అరెస్ట్ తప్పదు.. మంత్రి సుభాష్

2 months ago 4
తనపై వచ్చిన భూ కేటాయింపుల ఆరోపణలపై కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తోసిపుచ్చారు. అవినీతి కేసులో త్వరలో జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, అతడి కుమారుడు అరెస్టు అవుతారని తెలిపారు. రామచంద్రపురంలో ముగ్గురు వైఎస్ఆర్సీపీ నాయకులు ఖాళీగా ఉన్నారని, వారి ఉనికి కోసం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్‌సీపీ నేత పిల్లి సూర్యప్రకాష్‌కు లీగల్‌ నోటీసులు పంపినట్టు తెలిపారు. ఆయన ఆధారాలు చూపించలేక పోయారని, దీనిపై సివిల్, క్రిమినల్‌ కేసులు పెడతానని స్పష్టం చేశారు. తాను భూకబ్జాకు పాల్పడ్డానని కొంతమంది రామచంద్రాపురంలో ధర్నా చేశారని, ఆధారాలు ఉంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. తన ప్రమేయం ఒక్కశాతం ఉన్నట్లు తేలినా దేనికైనా సిద్ధమని సవాల్ విసిరిన మంత్రి సుభాష్... మహిళలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు స్వార్థ రాజకీయాలకు బలవుతున్నారని మండిపడ్డారు.
Read Entire Article