Nara Lokesh Fulfills First Promise To Bangarupalyam: మంత్రి నారా లోకేష్ తన 'యువగళం పాదయాత్ర' సందర్భంగా ఇచ్చిన తొలి హామీని 100 రోజుల్లోనే నెరవేర్చారు. పాదయాత్రలో మొదటి 100 కిమీ మైలురాయిని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పూర్తికాగా.. అక్కడ డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బంగారుపాళ్యంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ సెంటర్‌లో అవసరమైన యంత్రాలను, ఇతర వస్తువుల్ని తీసుకొచ్చారు.