పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు రామాలయాన్ని విజయదశమి నాటికి సిద్ధం చేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఆగస్ట్ 16 నుంచి శిలాకృతుల అమరిక పనులను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం సాయంత్రం రామాలయం ప్రాంగణాన్ని రఘురామ పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణం కోసం పక్కనే ఉన్న స్థలాన్ని కొనుగోలు చేశారు. అనంతరం పనులను పర్యవేక్షించిన ఆయన.. అక్టోబర్ 20 నాటికి ఆలయాన్ని సిద్ధం చేయాలని సంకల్పించినట్లు తెలిపారు.