APSRTC Dasara Special Bus services: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.. దసరా పండుగ సందర్భంగా 6,100 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు తెలిపింది. తెలంగాణ, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర జిల్లాలకు కూడా సర్వీసులు నడుస్తాయి.అక్టోబర్ 4 నుంచి 20వ తేదీ వరకు మొత్తంగా 6,100 బస్సులు నడుస్తాయని తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని, సాధారణ రోజుల్లో ఉండే టిక్కెట్ ధరలే వర్తిస్తాయి.. అలాగే 10శాతం రాయితీ కూడా ప్రకటించారు.