దాచేపల్లి: ట్రావెల్స్ బస్సు బీభత్సం.. 147 గొర్రెల మృతి

1 month ago 4
పల్నాడు జిల్లా దాచేపల్లి- పిడుగురాళ్ల మార్గంలో నేషనల్ హైవేపై ఓ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం సృష్టించింది. గొర్రెల మందపైకి దూసుకుపోవడంతో గాయాలపాలై, టైర్ల కింద నలిగిపోయి 147 గొర్రెలు చనిపోయాయి. తెలంగాణలోని నారాయణపేట జిల్లా ధన్వాడకు చెందిన ఆవుల మల్లేశ్, అతని మామ కర్రెప్ప, మరికొందరు నెలరోజులుగా పల్నాడు జిల్లాలో గొర్రెలు మేపుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో 600 గొర్రెల మందతో పులిపాడు- నడికూడి పంట పొలాల నుంచి పిడుగురాళ్ల వైపు హైవే ఫ్లైఓవర్‌ మీదుగా మందను తోలుకెళ్తున్నారు. మంచు కురుస్తున్న ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన శ్రీమారుతి ట్రావెల్స్‌ బస్సు మందపైకి దూసుకెళ్లింది. సుమారు 85 మీటర్ల మేర గొర్రెలను లాక్కెళ్లింది. టైర్లకు కళేబరాలు చుట్టుకొని, బస్సు ముందుకు కదల్లేక ఆగిపోయింది. కిందకు దిగి చూసిన డ్రైవర్‌.. పదుల సంఖ్యలో గొర్రెలు చనిపోయి ఉండటాన్ని గుర్తించి, వెంటనే పరారయ్యాడు. ఈ ఘటనలో గొర్రెల కాపరి మల్లేశ్‌ తీవ్రంగా గాయపడ్డారు.
Read Entire Article