Damagundam Radar Station Foundation Stone: హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న వికారాబాద్ జిల్లాలోని దామగుండం ఫారెస్ట్‌లో ఏర్పాటు చేయనున్న వీఎల్ఎఫ్ నేవీ రాడారా స్టేషన్‌కు ఈరోజు (అక్టోబర్ 15న) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. అయితే.. జీవవైవిధ్యం ళ్లకు కట్టినట్టు ఉండే దామగుండం ఫారెస్ట్‌లో ఇలాంటి నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయటంపై స్థానికులు, పర్యావరణ సంఘాలు, విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ స్టేషన్ వల్ల ఎవరికి లాభం.. ఎలాంటి నష్టాలు ఉన్నాయనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.