హైదరాబాద్‌లో ఒక వ్యక్తి ఐదు నవజాత కుక్క పిల్లలను అత్యంత కిరాతకంగా చంపేశాడు. సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి వాటిని నేలకేసి కొట్టి, గోడకు విసిరి చంపి.. కొన ఊపిరితో ఉన్న వాటి తలలను కాలితో తొక్కాడు. ఈ అమానుష ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. జంతు సంక్షేమ కార్యకర్తలు నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.