దారుణ ఘటన.. భర్త డబ్బులు ఇవ్వలేదని 2 నెలల చిన్నారిని ట్రాక్టర్ టైర్ల కింద విసిరేసిన తల్లి..

4 months ago 6
మెదక్‌ జిల్లాలో తల్లి చేసిన అమానుష చర్య కలకలం రేపింది. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లికి చెందిన సంధ్య తన భర్త స్వామితో కూలీ డబ్బులపై వాగ్వాదానికి దిగింది. భర్త డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహంతో సంధ్య చెత్త బండి సిబ్బందిపై కూడా గొడవ పెట్టుకుంది. వారు తమకు సంబంధం లేదని చెప్పడంతో.. కోపంతో ఒడిలో ఉన్న రెండు నెలల శిశువును చెత్త ట్రాక్టర్‌ టైర్ల కిందకు విసిరేసింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే చిన్నారిని రక్షించి శిశు సంరక్షణ అధికారులకు సమాచారం ఇచ్చారు. అంగన్‌వాడీ సిబ్బంది సంధ్యకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.
Read Entire Article