దిత్వా తుఫాను నేపథ్యంలో ఏపీలో ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తుఫాను.. ఆదివారం తెల్లవారుజామునకు తీవ్రవాయుగుండంగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో తుఫానుపై సమీక్షించిన మంత్రి అనిత.. అధికారులను అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు బలగాలను తరలించాలని సూచించారు. అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు వీలైనంత వరకూ ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు.