ఆడబిడ్డల భద్రత కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన దిశ యాప్‌ను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. శాసన మండలిలో దిశ యాప్‌పై ఆమె మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా మహిళలకు రక్షణ కల్పించాలని వరుదు కళ్యాణి కోరారు. పనిచేసే చోట మహిళలు అనేక వేధింపులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దిశ యాప్ ఉంటే మహిళలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పారు. దిశ యాప్ ను కొనసాగిస్తారా? లేక మరొక యాప్ తీసుకొస్తారా సమాధానం చెప్పాలన్నారు. కళ్యాణికి హోంమంత్రి వంగలపూడి అనిత కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంకు చట్టబద్దత ఉందా అని ప్రశ్నించారు. దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళలు రక్షింపబడ్డారో లెక్కలు తీసుకోవాలన్నారు. తాము కొత్తగా శక్తి యాప్‌ను తీసుకొస్తున్నామన్నారు.. నెటవర్క్ పనిచేయని చోట కూడా పనిచేసేలా రూపొందిస్తున్నామన్నారు.