దుబాయ్‌లో అరెస్ట్ కాలేదు.. హైదరాబాద్‌లోనే ఉన్నా: పైలట్

1 month ago 6
తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి.. తనపై వస్తున్న తప్పుడు వార్తలను ఖండించారు. తాను దుబాయ్‌లో అరెస్ట్ అయ్యానంటూ కొన్ని మీడియా ఛానెళ్లు, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేశారు. తాను హైదరాబాద్ మణికొండలోని తన నివాసంలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తాండూరు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు వెల్లడించారు.
Read Entire Article