దుర్గామాత విగ్రహ నిమజ్జనానికి అక్టోబర్ 1న మధ్యాహ్నం 3 గంటల నుండి అక్టోబర్ 2 ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మళ్లింపులు విధించారు. ట్యాంక్ బండ్, PVNR మార్గ్ సమీపంలోని అనేక మార్గాల్లో వాహనాలు నడపడం నిషేధించారు. ప్రజలు ప్రత్యామ్నాయ రోడ్లను తీసుకోవాలని సూచించారు. ఈ సూచనలు ప్రతీ వాహనదారుడు గమనించాలని.. అనవసరంగా ట్రాఫిక్‌లో ఇరుక్కొని ఇబ్బందులకు గురికావద్దని సూచించారు ట్రాఫిక్ పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.