ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు టెక్కలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్‌కు చెప్పు చూపిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో దువ్వాడ శ్రీనివాస్‌కు 41ఏ నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు తనకు నోటీసులు ఇవ్వడంపై దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. రెండేళ్ల కిందటి ఘటనకు ఇప్పుడు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న దువ్వాడ శ్రీనివాస్.. జనసేన శ్రేణులపై తాను చేసిన ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.