దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి షాక్.. బెయిల్ పిటిషన్‌ రద్దు

1 hour ago 1
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి మళ్లీ షాక్ తగిలింది, శాంతి బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు రద్దు చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన శాంతి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మే 19వ తేదీ వరకూ ఆమె రిమాండ్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు బెయిల్ ఇవ్వాలంటూ శాంతి తరపున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మీద విచారించిన ఏసీబీ కోర్టు.. బెయిల్ పిటిషన్ రద్దు చేసింది. కేసు విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని ఏసీబీ తరుఫున ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. శాంతి బెయిల్ పిటిషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Read Entire Article