దేవుడిలా వచ్చిన గొర్రెల కాపరి.. తప్పిన ఘోర ట్రైన్ ప్రమాదం

10 hours ago 2
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ట్రైన్ ప్రమాదం తప్పింది. గూడూరు సమీపంలో రైలు పట్టాలు విరిగిపోగా.. ఓ గొర్రెల కాపరి సమయస్పూర్తితో వ్యవహరించటంతో ప్రమాదం తప్పింది. పట్టాలు విరిగిన విషయాన్ని గమనించి తన వద్ద ఉన్న ఎర్రని గుడ్డతో ట్రైన్‌కు ఎదురుగా పరిగెత్తాడు. గమనించిన ట్రైన్ లోకో పైలట్.. రైలుకు బ్రేకు వేశాడు. ఇలా గొర్రెల కాపరి వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ మార్గంలో విజయవాడ నుండి తిరుపతి వెళ్లే అనేక రైళ్లు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి ట్రాక్‌పై పట్టా విరిగిపోవటం కలకలం రేపింది.
Read Entire Article