దేశంలో కొత్త వైరస్ వ్యాప్తి.. ఏపీ ఆరోగ్యశాఖ అలర్ట్.. కీలక నిర్ణయాలు

2 weeks ago 3
దేశంలో చైనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మన దేశంలోనూ హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదైనట్లు ఐసీఎంఆర్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై సమీక్ష నిర్వహించారు. పక్క రాష్ట్రాలలో కేసులు నమోదైన నేపథ్యంలో అప్రమత్తతతో ఉండాలని.. ఆస్పత్రులలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని.. పరీక్షలకు కావాల్సిన కిట్లు, ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు.
Read Entire Article