హైదరాబాద్‌కు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్కైరూట్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విక్రమ్-1 ఆర్బిటల్ రాకెట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం జెండా ఊపి ప్రారంభించారు. దేశంలోనే ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ ఇది కావడం విశేషం. ఈ సందర్భంగా ఏరోస్పేస్ రంగంలో తెలంగాణను ప్రపంచ అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. అలాగే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా అంతరిక్ష సాంకేతికతలో యువతకు శిక్షణ ఇచ్చేందుకు స్కైరూట్ సంస్థ ప్రభుత్వంతో చేతులు కలపనుంది.