ఉస్మానియా ఆస్పత్రి మరో కీలక మైలురాయిని అధిగమించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే రోగికి ఒకేసారి 5 అవయవాలను విజయవంతంగా మార్పిడి చేసి అరుదైన ఘనతను దక్కించుకుంది. 36 గంటల పాటు నాన్‌స్టాప్‌గా సాగిన ఈ సుదీర్ఘ ఆపరేషన్ సక్సెస్ కావడంతో.. ఉస్మానియా ఆస్పత్రి డాక్టర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది.