రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐబీఎం, టీసీఎం, ఎల్అండ్‌టీతో ఇటీవల ఎంవోయూ కుదుర్చుకుంది. తాజాగా అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై కీలక ముందడుగు పడింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణం కోసం ప్రభుత్వం 50 ఎకరాలు భూమిని కేటాయించింది. అలాగే బసవతారకం మెడికల్ కాలేజీకి 6 ఎకరాలు అదనంగా కేటాయించారు. ఈ మేరకు ఏపీ కేబినెట్ సబ్‌కమిటీలో నిర్ణయం తీసుకున్నారు.