Womens Football Academy Hyderabad: తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'ను నిర్వహించనుంది. ఈ సమ్మిట్‌లో దేశంలోనే తొలి మహిళా ఫుట్‌బాల్ అకాడమీ, రెండో పురుషుల ఫుట్‌బాల్ అకాడమీ ఏర్పాటుతో పాటు అంతర్జాతీయ చెస్ పోటీల నిర్వహణపై కీలక ప్రకటనలు వెలువడనున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ సమ్మిట్‌కు ఆహ్వానించారు. అలానే అతిథిలకు ప్రత్యేక బహుమతులను అందించనున్నారు.