Chandrababu Naidu Richest CM: దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం చంద్రబాబు తొలి స్థానంలో నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదికలో తెలిపారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిచారు. ఆమె వద్ద కేవలం రూ.15 లక్షల ఆస్తే ఉందని ఏడీఆర్ పేర్కొంది. ఈ జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఏడో స్థానంలో నిలిచారు. ఆయనకు రూ.30.04 కోట్ల ఆస్తులు ఉన్నాయి.